జమ్మలమడుగులో ఏం జరుగుతోంది…

0 26

కడప  ముచ్చట్లు:

ఆయన నిన్న గాక మొన్న వచ్చారు. దశాబ్దాల నాటి నుంచి పాతుకుపోయిన ఆయనను ఈయన తరిమికొట్టాలనుకుంటున్నారు. అదేంకుదరదని ఆయన అడ్డంతిరుగుతున్నారు. ఇదీ స్థూలంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిస్థతి. ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి మధ్య రోజురోజుకూ విభేధాలు ముదురుతున్నాయి. జమ్మలమడుగులో పట్టు సంపాదించుకునేందుకు ఇరు వర్గాలు చేస్తున్న ప్రయత్నాలు పార్టీని అభాసుపాలు చేస్తున్నాయి.జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డిల మధ్య అనేకసార్లు హైకమాండ్ పంచాయతీ చేసింది. ఇద్దరినీ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. రాజీ ఫార్ములాను కూడా సూచించింది. వచ్చే ఎన్నికలలో టిక్కెట్ తిరిగి సుధీర్ రెడ్డికే ఇస్తామని రామసుబ్బారెడ్డికి స్పష్టం చేసింది. అదే సమయంలో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో జమ్మలమడుగులో రెండు వర్గాలు సర్దుకుపోతాయని అంతా భావించారు.ఇటీవల నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా రామసుబ్బారెడ్డికి ఇవ్వకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ గ్యారంటీ అయింది. అయితే తనకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని రామసుబ్బారెడ్డి వాపోతున్నారు. తనకు ఏ సమావేశంలోనూ ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తనను కలుపుకుని పోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. నిజానికి సుధీర్ రెడ్డికే రామసుబ్బారెడ్డి అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు కావాలంటే రామసుబ్బారెడ్డితో సఖ్యతగా మసలుకోవడం సుధీర్ రెడ్డికి మేలు.
ఎందుకంటే హైకమాండ్ వచ్చే ఎన్నికల్లోనూ సుధీర్ రెడ్డికే టిక్కెట్ కన్ఫర్మ్ చేసింది. ప్రత్యర్థిగా ఖచ్చితంగా ఆదినారాయణరెడ్డి తలపడతారు. ఈ సమయంలో రామసుబ్బారెడ్డి ఆసరా ఉంటే సులువుగా మరోసారి విజయం సాధించవచ్చు. కానీ సుధీర్ రెడ్డి తన చర్యలతో ఆయనను దూరం చేసుకుంటున్నారు. రామసుబ్బారెడ్డి పరోక్షంగా ప్రత్యర్థులతో వచ్చే ఎన్నికల్లో చేయి కలిపితే సుధీర్ రెడ్డికి సినిమాయే కనపడుతుంది. సర్దుకుపోవాల్సిన సమయంలో సుధీర్ రెడ్డి రెచ్చిపోతుండట సరికాదన్నది పార్టీ నేతల అభిప్రాయం. మొత్తం మీద జమ్మలమడుగు వ్యవహారం మళ్లీ అడ్డం తిరిగిందనే..

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:What’s going on in Jammalamadugu …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page