టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ప్రమాణం చేఎంచిన  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

0 5

వరంగల్‌  ముచ్చట్లు :

 

ఓటుకున్న విలువను వివరించాల్సిన ఆయన టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం చేయిస్తున్నారు. గౌడ కులస్తులతో కులదేవత ఎల్లమ్మ తల్లిపై ప్రమాణం చేయించారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఈ ఘటన గూడూరు గ్రామంలో జరిగింది. ఎల్లమ్మ దేవాలయం నిర్మాణానికి 10 లక్షలు ఇస్తామని ప్రలోభపెట్టారు. గూడూరు గ్రామంలో జరిగిన  ఈ ప్రమాణం చేయించడం ఘటన పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ద్వారా తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ పద్ధతి ప్రకారం ఓటర్లు నేరుగా నిర్ణయం తీసుకుంటారు. ఎంపిక విధానాన్ని ఎన్నికల సంఘం గోప్యంగా ఉంచుతుంది. ఇందుకోసం రహస్య బ్యాలెట్ లేదా ఈవీఎంలను ఉపయోగిస్తారు. ఓటర్లు తమ రాజకీయ గోప్యతను కాపాడుకోవడానికి ఈ రెండు విధానాలు ఉపయోగపడతాయి. ఓటుకున్న ప్రాధాన్యతను చులకన చేస్తూ ధర్మారెడ్డి వ్యవహరించడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. కోరి మరీ ఈయన వివాదాల్లో తలదూర్చుతున్నారు. ధర్మారెడ్డి ఏం మాట్లాడినా… ఏం చేసినా అది వివాదమవుతోంది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: MLA Challa Dharmareddy has been sworn in to vote for TRS

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page