టీటీడీ ఆసుపత్రుల్లో జనరిక్ మందుల వాడకం పెంచాలి

0 17

– టెండరు గడువుకు నాలుగు నెలల ముందే కొత్త టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలి

ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

 

- Advertisement -

తిరుమల ముచ్చట్లు :

 

టీటీడీ నిర్వహణ లోని ఆస్పత్రులన్నింటికీ అవసరమయ్యే మందులు, వైద్య పరికరాలు కేంద్రీకృత కొనుగోలు విభాగం నుంచి కొనుగోలు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ ఆసుపత్రుల్లో జనరిక్ మందుల వాడకం పెంచడంతో పాటు వాటిని ప్రోత్సహించాలన్నారు.తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం సాయంత్రం ఆయన మందులు, వైద్య పరికరాల కొనుగోలు విధానం పై సమీక్ష నిర్వహించారు.
స్విమ్స్ లో మందులు, పరికరాల కొనుగోలు కోసం టెండర్లు నిర్వహిస్తున్న విధానం తెలుసుకున్నారు. టెండర్ కాల పరిమితి పూర్తి కావడానికి నాలుగు నెలల ముందు నుంచే మళ్లీ టెండర్లు ఆహ్వానించే కసరత్తు ప్రారంభించాలన్నారు. ఏమందులు కావాలో ప్రతిపాదనలు పంపే అధికారులు వాటి నాణ్యత నిర్ధారించే కమిటీలో ఉండకూడదని చెప్పారు. ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ విభాగం నుంచి ఈ కమిటీలో ఒకరిని ఏర్పాటు చేసుకోవాలని ఈవో సూచించారు. రెండేళ్లకు సరిపడే మందులు ఒకే సారి కొనుగోలు చేసుకుకోవాలని ఇందుకోసం నిమ్స్, నింహ్యాన్స్ ఆసుపత్రులు అవలంభిస్తున్న విధానం అమలు చేసుకోవాలని ఈవో చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ లో మందులు ఏ ధరకు సరఫరా చేసున్నారో కూడా తెలుసుకోవాలని అన్నారు.అదనపు ఈవో  ధర్మారెడ్డి,జెఈవో  సదా భార్గవి, ఎఫ్ ఏ అండ్ సీఏఓ  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, బర్ద్ ఆర్ఎమ్ఓ శేష శైలేంద్ర, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, స్విమ్స్ కొనుగోలు విభాగం అధికారులు డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ ఎర్రమ రెడ్డి పాల్గొన్నారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: The use of generic drugs in TTD hospitals should be increased

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page