ట్రైనీ మహిళా ఎస్ఐపై లైంగిక దాడి.. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి అరెస్ట్ కు సీపీ ఆదేశం

0 20

మహబూబాబాద్‌ ముచ్చట్లు :

 

ట్రైనీ ఎస్ఐపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని.. మహబూబాబాద్‌ ఎస్పీని వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఆదేశించారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి. తనపై ఎస్ఐ అర్ధరాత్రి అత్యాచారం చేశారని దళిత ట్రైనీ ఎస్ఐ వరంగల్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి తనను అడవిలోకి తీసుకువెళ్లి బలత్కారం చేసినట్లు కుటుంబసభ్యులతో కలిసి సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితురాలు ఆరోపించింది. దళిత యువతి కావడమే తన బిడ్డ చేసిన పాపమా? అని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. తనకు న్యాయం జరగకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పింది. దీంతో వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Sexual assault on trainee woman SI .. CP orders arrest of SI Srinivas Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page