తమిళనాడుకు తరలిపోనున్న ‘అమరరాజా’!

0 27

తిరుపతి ముచ్చట్లు :

 

వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ఏపీలోని అమరరాజా బ్యాటరీస్ సంస్థ తమిళనాడుకు తరలిపోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాటరీల తయారీలో దేశంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న అమరరాజా బ్యాటరీస్‌‌ సంస్థకు ఇటీవల కష్టాలు మొదలయ్యాయి. తిరుపతి శివారులోని కరకంబాడి వద్ద ఈ ప్లాంటు నుంచి పరిమితికి మించి కాలుష్యం వెలువడుతోందని, కాబట్టి మూసివేయాలంటూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఏప్రిల్‌లో కంపెనీకి నోటీసులు జారీ చేసింది. దీంతో సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో స్టే లభించింది. ఆ తర్వాత కార్మికశాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆరోగ్యశాఖలు ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించాయి. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా దాడి మొదలు కావడంతో మనస్తాపం చెందిన అమరరాజా యాజమాన్యం ప్లాంటును తరలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: ‘Amararaja’ to move to Tamil Nadu!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page