ద్విచక్ర వాహనాల దొంగలు11 మందిఅరెస్టు. . …

0 35

 

చిత్తూరు    ముచ్చట్లు:

 

- Advertisement -

ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే 11 మంది దొంగలు అరెస్టు.సుమారు రూ. 1 కోటి విలువైన 107 ద్విచక్ర వాహనాలు, 1 ట్రాక్టర్ స్వాధీనం.చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదు కాబడిన ద్విచక్ర వాహనాల దొంగతనాలను చేధించుటకు జిల్లా ఎస్. పి. ఎస్. సెంథిల్ కుమార్. చిత్తూరు జిల్లా లోని 4 సబ్ డివిజన్ అధికారుల స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పరచడమైనది. దర్యాప్తు లో భాగంగా ఈ ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా నమోదు అయ్యిన ద్విచక్ర వాహనాల దొంగతనాలను చేధిస్తూ చోరీకి పాల్పడి వాటిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అమ్మే 11 మంది దొంగలను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి 107 ద్విచక్ర వాహనాలు మరియు 1 ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకోవడమైనది. వీరంతా ద్విచక్ర వాహనాలను ఇంటి అరు బయట పార్కింగ్ చేసి ఉన్నప్పుడు, షాపింగ్ మాల్స్ వద్ద, దుఖానాల వద్ద పార్క్ చేసి ఉన్న వాహనాలను తస్కరించేవారు. చోరీ చేయబడిన వాహనాలను తక్కువ ధరకు అమ్మేవారు. వీరు చెడు వ్యసనాలకు బానిసై, సులభంగా డబ్బులు సంపాదించాలని కోరికతో ద్విచక్ర వాహనాల దొంగతనం చేసేవారు.

ముద్దాయిల వివరములు
చిత్తూరు సబ్ డివిజన్

1) A.వినోద్ కుమార్, వయస్సు – 25 సం. s/o దుర్వాసులు, దాసరపల్లె, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా.

2) C.G. రాజి, వయస్సు – 47 సం. s/o చిన్నయ్య నాయుడు, కినటపల్లె, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా.

3) ఎస్.రవి చంద్ర, వయస్సు – 32 సం. s/o శంకర్, ప్రశాంత్ నగర్, చిత్తూరు.

పుత్తూరు సబ్ డివిజన్

1) S. సతీష్ కుమార్, వయసు 27 సం., s/o సదమైయ్య, నాగాతమమ్మ నగర్, కట్టూర్, వెల్లనూరు, తిరువళ్లూరు జిల్లా, తమిళనాడు.

2) S.వెంకటేశ్వర్లు, వయసు 27, s/o మోహన్ రావు, కరిపాకం విలేజ్ & పోస్ట్, వరదయ్యపాలెం మండలం, చిత్తూరు జిల్లా

3) కె. సుబ్రమణ్యం, వయసు 18 సం., s/o కుమార్, కరిపాకం విలేజ్ & పోస్ట్, వరదయ్యపాలెం మండలం, చిత్తూరు జిల్లా

4) L. జయచంద్ర, వయసు 55 సం., s/o లేట్ లింగా నాడర్, బరిదాసన్ స్ట్రీట్, రెడ్‌హిల్స్, తిరువళ్లూరు జిల్లా, చెన్నై, తమిళనాడు.

పలమనేరు సబ్ డివిజన్

1) జి.మురళి, వయసు 25 సం., s/o జి.గోవిందస్వామి, ముదినేపల్లి గ్రామం, పేర్నయంబట్ తాలూకా, వెల్లూర్ డిస్ట్రిక్ట్, తమిళనాడు

2) పి. కుమారేశన్, వయస్సు 34 సంవత్సరాలు, S/o లేట్ పెరుమాళ్, మాసిగం గ్రామం, పేర్నయంబట్ తాలూకా, వెల్లూర్ డిస్ట్రిక్ట్, తమిళనాడు

3) ఎస్.జ్యోతి, వయస్సు – 50 సం. s/o గోవిందపిల్లై, అత్తిగారిపల్లె, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా.
శ్రీసిటి

1) సజ్జొల్ల యుగంధర్ వయస్సు 26 సంవత్సరాలు, s / o లేట్ S. రవి, కలమనాయుడు పేట, ఎన్ఆర్ కండ్రిగ, సత్యవేడు మండలం, చిత్తూరు జిల్లా.

స్వాధీనం చేసుకొన్న వాహనముల వివరములు

చిత్తూరు సబ్ డివిజన్ – 35
పుత్తూరు సబ్ డివిజన్ – 37
పలమనేరు సబ్ డివిజన్ – 28
శ్రీసిటి – 8

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

Tags:11 arrested for two-wheeler theft . …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page