నల్గొండ జిల్లాల్లో అగ్ని ప్రమాదాలు…భయపడుతున్న తండా వాసులు

0 14

నల్గొండ  ముచ్చట్లు :

నల్లగొండ జిల్లాలోని ఓ తండాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అంతా మాయలాగా జరుగుతోంది. ఎవరూ రాజేయకుండానే అగ్గి రాజుకుంటోంది. నిప్పు పుడుతోంది. అక్కడిక్కకడే ఏది ఉంటే అదే తగలబడుతోంది. నల్గొండ జిల్లా పాత ఊరి తండాలో ఇప్పుడిదో మిస్టరీఅంతుచిక్కని అగ్ని ప్రమాదాలతో అల్లాడుతున్న తండావాసులు మంత్రగాళ్లను ఆశ్రయించారు. దుష్టశక్తుల గండం నుంచి బయటపడాలంటే మంత్రులకు రెండు లక్షల రూపాయలు సమర్పించుకుని చేయించారు. మూడు మూగ జీవాలను బలి ఇచ్చినా అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. తండాలో ఏదో చోట నిప్పు రవ్వలు అంటుకుని మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రగాళ్ల పూజలు తండా వాసుల భయాన్ని పోగొట్టే లేకపోయాయి. నిత్యం వ్యవసాయ పనులకు వెళ్లకుండా తండాలో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆరాధ్య దైవమైన ఆంజనేయస్వామికి తండావాసులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మంత్రగాళ్ల పూజలు ఆంజనేయ స్వామి పూజలు తండావాసులు లేదా….ఇదివుంటే, నల్గొండ జిల్లా చందంపేట మండలం పాత ఊరి తండా గ్రామంలో కొద్దిరోజులుగా ఓ వింత జరుగుతోందీ అంటున్నారు స్థానికులు. ఊళ్లో ఎక్కడోచోట, ఏదో మూల, ఏదో ఒక ఇంట్లో, ఏదో ఒకటి తగలబడుతోంది. ఒకరోజు పొలంలో గడ్డివాము తగలబడితే, ఇంకోరోజు ఇంటి ముందు ఉన్న పశువుల కొట్టం అంటుకుంటోంది. ఏమైందా అని ఆరా తీసే లోపే.. ఈసారి నట్టింట్లో మంటలు రాజుకుంటుంటున్నాయి. ఇంట్లో ఉన్న బట్టలు, దుప్పట్లు, మంచాలు కాలిపోతున్నాయి.. !వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఈ విచిత్రమే గ్రామస్థులను భయపెడుతోంది. ఒకసారి రెండుసార్లు జరిగితే ప్రమాదం అనుకున్నారు. గడ్డివాములు లాంటివి తగలబడితే ఎండకో, ఏ బీడీ నిప్పుకో అంటుకుని ఉంటుందని భావించారు. కానీ, ఇళ్లలో బట్టలు ఎలా తగలబడతాయి. గూట్లో పెట్టిన పుస్తకాలకూ మంటలు ఎలా? సరే, అదీ ఏదో ప్రమాదం అనుకుందాం..కానీ, తాళాలు వేసి ఉన్న ఇంట్లో నుంచి కూడా పొగలు వస్తుంటే గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతలుకు గురవుతున్నాయి. అసలేలా మంటలు అంటుకుంటున్నాయో తెలియక ఉపిరి బిగపట్టుకుని కాలంవెళ్లదీస్తున్నారు తండావాసులు.రాత్రి పూట జరిగితే.. ఎవరో కావాలనే చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ.. పట్టపగలే జరుగుతోంది. ప్రత్యేకించి మధ్యాహ్నం 12 గంటల నుంచి 4గంటల మధ్యే ఈ నిప్పు, పొగ కనిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎప్పుడు ఏం అంటుకుంటుందో తెలీక గ్రామస్తులు పొలం పనులు కూడా మానేసి ఇంట్లోనే కూర్చుంటున్నారు. అయినా మంటలు ఆగలడంలేదట. 22 రోజుల నుంచీ చోటుచేసుకున్న ఈ ఘటనలతో ఊళ్లో క్షణ క్షణం గజగజ అనే చెప్పాలి. సాధారణంగా ఇలాంటి అంతుచిక్కని ఘటనలు ఉంటే గాలి సోకిందని, క్షుద్రపూజలని, దయ్యాలు, భూతాలని అంటూ ఉంటారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Fire accidents in Nalgonda districts … Frightened herdsmen

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page