నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు

0 17

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో రాంనగర్‌, ముషీరాబాద్‌ మున్సిపల్‌ డివిజన్‌ల లోని వివిధ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నగర వ్యాప్తంగా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటే ముషీరాబాద్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ”జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను నిఘా లోపం టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది అవినీతి కారణంగా అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.” దీంతో జీహెచ్‌ఎంసీ ఆదాయానికి పెద్దఎత్తున గండి పడుతోంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణా లను సహించేది లేదని బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ఎంసీ ఉన్నతా ధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవనె విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాస్త్రినగర్‌, హరినగర్‌, రీసాల, మోహన్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో కొందరు ఇంటి యజమానులు, బిల్డర్లు నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు జీప్లస్‌ త్రీ అక్రమ నిర్మాణాలను చేపట్టినప్పటికీ జీహెచ్‌ఎంసీ 15వ సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చోద్యం చూస్తున్నారు. రాంనగర్‌, ముషీరాబాద్‌ డివిజన్‌లలోని అనేక ప్రాంతా లలో కూడా దర్జాగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సిబ్బంది అటువైపు కన్నెత్తి కూడా చూడక పోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.

 

 

 

- Advertisement -

కొంత మంది యజమానులు ఇంటి నిర్మాణం కోసం అనుమతులు తీసుకున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా సెట్‌ బ్యాక్‌ లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పనిచేస్తున్న అధికారులు కింది స్థాయి సిబ్బంది అందినకాడికి దండుకోవడం వల్లే చర్యలు చేపట్టడంలో చేతులు దులిపేసుకున్నారనే విమర్శలూ స్థానికుల నుంచి వ్యక్త మవుతున్నాయి.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండ్ల నిర్మాణానికి అనుమతులు పొందిన వారు ప్రధాన వీధుల్లో పది అడుగులు, అంతర్గత రోడ్లలో ఐదు అడుగులు సెట్‌ బ్యాక్‌ పాటించాలి. అంతే కాకుండా ఇంటి చుట్టూ మూడు అడుగుల నుంచి ఐదు అడుగుల వరకు స్థలాన్ని వదిలి నిర్మాణం చేపట్టాలి, అదే విధంగా ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి కానీ ముషీరాబాద్‌లో మాత్రం ప్రాథమిక నిబంధనలను పాటించకుండా అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నారు.రాంనగర్‌ డివిజన్‌లోని హరినగర్‌లో ఓ వ్యక్తి సెట్‌బ్యాక్‌ లేకుండా అదనపు అంతస్తులు వేయడంతో క్రిస్టఫర్‌ అనే స్థానిక వ్యక్తి జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటన స్పందించి చర్యలు తీసు కోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.దీంతో అతను సమాచార హక్కు చట్టం నుంచి అనుమతి పత్రాలు తీసుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ,మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కలగజేసుకుని అక్రమ నిర్మాణాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Illegal structures contrary to regulations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page