పుంగనూరులో కరోనా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌లో మార్పు లేదు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 44

పుంగనూరు ముచ్చట్లు:

 

 

మున్సిపాలిటి పరిధిలోకరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సాయంత్రం 5 నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. మంగళవారం ఆయన తహశీల్ధార్‌ వెంకట్రాయులు, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రెడ్డికార్తీక్‌ తో కలసి సచివాలయ ఉద్యోగులతో కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ వేళలు ఆగస్టు 15వరకు కొనసాగిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్లు ధరించాలని లేకపోతే జరిమానాలు విధిస్తామన్నారు. అలాగే వ్యాపారులు మాస్క్లు లేకుండ అనుమతిస్తే రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానాలు విధించి, షాపు లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్‌ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: No change in lockdown as corona grows in Punganur: Commissioner KL Verma

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page