పుంగనూరు ప్రభుత్వాపత్రిలో పేదలకు వైద్యం అందేనా..?

0 118

-నేడు మెడికల్‌ ఆఫీసర్‌పై నర్సుదాడి
-నాడు ఆసుపత్రిలో నర్సుల ధర్నాలు

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

పేద రోగులకు వైద్య సేవలు అందించాల్సిన కొంత మంది నర్సులు రాజకీయాలు చేస్తూ, ధర్నా, గొడవలు సృష్టించి, వైద్యులపై తిరుగుబాటు చేసి ఏకంగా మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేయడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ చిర్మిల విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ప్రవరిస్తూ , సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న నాగలక్ష్మి అనే నర్సును మందలించారు. ఈ విషయమై నర్సు ఆగ్రహంతో అందరి సమక్షంలో మెడికల్‌ ఆఫీసర్‌ చిర్మిలను దూషిస్తూ ఆమెపై దాడి చేశారు. ఈ విషయమై మంత్రి డాక్టర్‌ పెద్దిరెడి రామచంద్రారెడ్డి దృష్టికి మెడికల్‌ ఆఫీసర్‌ తీసుకెళ్లారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాగలక్ష్మి నర్సుపై కేసు నమోదు చేశారు.

ఆసుపత్రిలో గ్రూపు రాజకీయాలు…

ప్రభుత్వ కమ్యూనిటి హెల్త్ సెంటర్‌లో నర్సులు స్థానిక నివాసులు కావడం, వీరికన్న వయసులో చిన్నవారు మెడికల్‌ ఆఫీసర్లు రావడంతో సహించలేని నర్సులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఫలితంగా గత ఆరు నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల గ్రూపు రాజకీయాలకు మెడికల్‌ ఆఫీసర్లు బలౌతున్నారు. గతంలో మెడికల్‌ ఆఫీసర్‌గా ఉన్న ఫైరోజ్‌బేగం సక్రమంగా పనిచేయడం లేదని ఒకవర్గం నర్సులు , వారి కుటుంబ సభ్యులు మంత్రికి ఫిర్యాదు చేశారు. మంత్రి ఆగ్రహంతో గంటల వ్యవధిలో ఫైరోజ్‌బేగంను బదిలీ చేసి గైనకాలజిస్ట్ డాక్టర్‌ చిర్మిలను నియమించారు. కొద్ది రోజుల పాటు మౌనందాల్చిన నర్సులు మధుబాల, పద్మావతి , నాగలక్ష్మి మెడికల్‌ ఆఫీసర్‌పై పెత్తనం చెలాయించడంతో మెడికల్‌ ఆఫీసర్‌ వీరికి అడ్డుకట్ట వేశారు. సహించలేని నర్సులు ధర్నాలు, అల్లర్లు సృష్టించారు. దీనిని గమనించిన మంత్రి పెద్దిరెడ్డి దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ విచారణ జరిపి, బాధ్యులైన హెడ్‌నర్సులుగా పని చేస్తున్న మధుబాల, పద్మావతి లను అమరావతిలోని కమిషనర్‌కు సరెండర్‌ చేశారు. ఈ సమయంలో మెడికల్‌ ఆఫీసర్‌పై నాగలక్ష్మి దాడి చేయడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఆసుపత్రిలో నర్సులను బదిలీ చేయాలని పలువురు డిమాండు చేస్తున్నారు.

 

దళిత సంఘాల ఆగ్రహం…..

దళిత కులానికి చెందిన మెడికల్‌ ఆఫీసర్‌ చిర్మిల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తుంటే ఆమెపై అగ్రవర్ణాలకు చెందిన నర్సులు దాడి చేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్ర దళిత నాయకులు యమల సుదర్శనం, ఎన్‌ఆర్‌.అశోక్‌, సుబ్రమణ్యం, ఎం.శంకరప్ప, నరసింహులు కలసి ఆసుపత్రిలో మెడికల్‌ ఆఫీసర్‌ను పరామర్శించి, ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపి, దాడికి పాల్పడిన నర్సుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, డాక్టర్‌కు రక్షణ కల్పించాలని , ఇందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండు చేశారు.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

Tags: Is there any treatment for the poor in Punganur Government Gazette ..?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page