బోనాల పండుగలో అమ్మవార్లకు బోనం సమర్పించిన సభాపతి పోచారం

0 8

కామారెడ్డి ముచ్చట్లు :
బాన్సువాడ పట్టణంలో మంగళవారం జరిగిన బోనాల పండుగలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో తాడ్కోల్ డబుల్ బెడ్ రూం కేసీఆర్ నగర్ పిఎస్ ఆర్ కాలనీ లలో జరిగిన బోనాల పండుగలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలపై బోనం ఎత్తుకొని ప్రజలతో కలిసి ఊరేగింపు గా తరలి వెళ్లి అమ్మవార్లకు బోనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. బోనాల పండగ తెలంగాణ సంప్రదాయంలో భాగమని, బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించిందని తెలిపారు. అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందాలని ప్రార్ధించారు.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Speaker Pocharam presenting Bonam to Ammavarla during Bonala festival

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page