మండల్, మునిసిపల్ టాస్క్ ఫోర్స్ ప్రతి రోజు కోవిడ్ నియంత్రణ పై  సమీక్ష చేసుకోవాలి

0 3

సోషల్, రిలిజియస్ ఫంక్షన్లలో కోవిడ్ నామ్స్ తప్పనిసరి
కంటైన్మెంట్ జోన్ లలో జి ఓ 371 అమలు కావాలి .జిల్లా  కలెక్టర్

తిరుపతి ముచ్చట్లు :
జిల్లా లో పాజిటివిటీ రేట్ 21 మండలాల్లో పెరుగుతున్న దృష్ట్యా  మండల మునిసిపల్  టాస్క్ ఫోర్స్ ప్రతి రోజు గంట పాటు సమయం కేటాయించి సమీక్షించి  కోవిడ్ 19 నియంత్రణపై చర్యలు చేపట్టాలని  రికవరీ రేటుకన్నా  పాజిటివిటీ రేటు పెరుగుతున్నదని ఇవి ప్రమాద హెచ్చరికలుగా గుర్తించి  చర్యలు  చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్  ఆదేశించారు. మంగళవారం  ఉదయం స్థానిక ఆర్ డి ఓ కార్యాలయం నుండి మండల, మునిసిపల్ టాస్క్ ఫోర్స్ , మెడికల్ ఆఫీసర్ల తో వారపు వీడియో కాన్ఫిరెన్స్  ద్వారా జే సి హెల్త్ వీర బ్రహ్మం తో కలిసి జిల్లా కలెక్టర్  సమీక్షించారు.
జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ స్పెషల్ ఆఫీసర్లు , మండల, మునిసిపల్ టాస్క్ ఫోర్స్ కోవిడ్ నియంత్రణ కోసం  టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, వాక్సినేషన్ పై అప్రమత్తం అవసరమని, సీరియస్ గా పని చేయాలని ఆదేశించారు.  గత వారం జిల్లా పాజిటివిటీ రేటు   2.48 నుండి 2.76 కు చేరిందని 2400 నుండి 3100 గా యాక్టివిటీ కేసులు జిల్లాలో  వున్నాయని అసలసత్వం   వీడి అప్రమత్తంగా వుండాలని అన్నారు.  ఇది కోవిడ్ కేసులు పెరగడానికి సంకేతాలు అని గుర్తించాలని అన్నారు.  పాజిటివిటీ  కేసులు నమోదు అయిన వారి మొదటి , రెండవ   కాంటాక్ట్  ట్రేసింగ్ చేసి వారిని హోమ్ ఇసోలేషన్ లో వుంచి పరీక్షలు   చేయాలని,  వారిని ఎట్టి పరిస్థితులలో  బయట తిరగకుండా  చూడాలని అన్నారు.  సోషల్, రిలిజియస్  కార్యక్రమాలలో భౌతిక దూరం, మాస్కులు ధరించేలా,  గుంపులుగా లేకుండా  చూడాలని వీటిపై ప్రత్యేక దృష్టి  పెట్టాలని అన్నారు.  రేణిగుంట, తవణంపల్లి , సదుం, చిత్తూరు అర్బన్, తిరుపతి అర్బన్, నగరి, చిన్న పాండూరు, గంగవరం, బైరెడ్డి పల్లి ప్రాంతాలలో  కంటైన్మెంట్  జోన్ లలో కోవిడ్  నిబంధనలు  పూర్తి  స్థాయి లో అమలు కావాలని, అప్పుడే  కేసులు తగ్గే  అవకాశం ఉంటుందని  సూచించారు.  లక్షణాలు వున్న వాళ్లకి , ప్రైమరీ  సెకండరీ కాంటాక్ట్స్  వారికి  పరీక్షలు చేస్తే  పాజిటివిటీ వచ్చిన వ్యక్తులను కోవిడ్ కేర్, లేదా ఆసుపత్రులకు  తరలించాలని,  అందుకే అన్ని కోవిడ్ సెంటర్లు , ఆసుపత్రులను  కోవిడ్ కోసం  అందుబాటులో ఉన్నాయనేది గుర్తించాలని  తెలిపారు.  జి. ఓ.  371 అమలు ఖచ్చితం గా జరగాలని అపరాధ రుసుము , షాప్స్ టైమింగ్ , కాంటాక్ట్స్  ట్రేసింగ్ వంద శాతం  అమలు కావాలని ఆదేశించారు.   టెస్టింగ్ విషయంలో ఏ రోజు కా రోజు రిజల్ట్ రావాలని, హోమ్ ఇసోలేషన్ వారిని ప్రతి రోజు పరిస్థితి  సమీక్షించాలని  సూచించారు.   చిన్న పిల్లల తల్లులు, టీచర్లు, 45 సంవత్సరములు  పై బడ్డ వారికి   రెండవ డోస్ వాక్సినేషన్ పై దృష్టి పెట్టాలని  90 % కు తీసుకురావాలని  ఆవిధం గా  ప్రణాళిక  మీ వద్ద  వుంచుకొని అమలు చేయాలని అన్నారు.  సచివాలయాలు:  సచివాలయాలలో  హాజరు నమోదు  100%, అక్కడ అందించే  సర్వీసులు పెన్షన్స్,  రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, ఆరోగ్యశ్రీ కార్డులకు  ప్రాధాన్యత నిచ్చి  నిర్ణీత  గడువు లోగా  పరిష్కరించాలని తెలిపారు.  మండల  అభివృద్ది అధికారులు నరేగా  లేబర్ కాంపోనెంట్ పై దృష్టి పెట్టి పనిదినాలు కల్పించాలని  సూచించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో జే సి హెల్త్  వీర బ్రహ్మం , కలెక్టర్  గారితో పాటు  సమీక్ష  జరపగా,  డి ఎం హెచ్ ఓ  శ్రీహరి, తిరుపతి నగర పాలక సంస్థ  మెడికల్ ఆఫీసర్  హరికృష్ణ , డిప్యుటీ  డి ఎం హెచ్ ఓ లు అరుణ సులోచన,  ఆర్ ఆర్  రెడ్డి, కమ్యునిటీ  హెల్త్ ఆఫీసర్  మధుసూదన్ తిరుపతి నుండి పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:The Mandal and Municipal Task Force should review the Kovid control every day

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page