యూరియా కోసం క్యూలైన్లు

0 23

నిజామాబాద్      ముచ్చట్లు:
యూరియా కోసం క్యూ లైన్ లల్లో చెప్పులు, సంచులు, రాళ్లు పెట్టిన వైనం ఇది.  నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ సహకార సంఘం  వద్ద రైతులు  రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు. సరైన సమయంలో ఎరువులు అందక రైతుల్లో ఆందోళన నెలకొంది.  సొసైటీ పరిధిలో ఆర్గుల్,జక్రన్ పల్లి, పడకల్, కేష్ పల్లి, సికింద్రాపూర్, పుప్పాల పల్లి, నారాయణపేట మాదాపూర్, గ్రామాల రైతులకు యూరియా ఎరువులు అవస్థలు ప్రారంభమయింది. వరి నాట్లేసిన రైతులకు ఖచ్చింతంగా యూరియా అవసరం  వుంటుంది. అధికారులు,  సహకార సంఘం ప్రతినిధులు సకాలంలో స్పందించడం లేదని రైతులు ఆరోపించారు. సొసైటీ లో కేవలం నాలుగు  వందల బస్తాలు ఉంటే క్యూ లైన్ లో సుమారు తొమ్మిది వందల మంది  క్యూ లైన్ లల్లో చెప్పులు,పాస్ పుస్తకాలు,రాళ్లు పెట్టారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:Culinaries for urea

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page