లేగదూడకి బారసాల

0 28

మచిలీపట్నం  ముచ్చట్లు:
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో డాబాలసెంటర్ లో ఇటీవల జన్మించిన ఓ అవు లేగదూడ కి ఘనంగా బారసాల నిర్వహించి మూగజీవాల తమకున్న ప్రేమను చాటుకున్నారు. గత నెల జూలై 6 తారిఖున ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న  బంగారం అనే గోవుకి అడ శిశువు జన్మించింది.. సాధారణంగా మనుషులకు చేసే నెలలోపు చేసే ఉయ్యాల వేడుకలాగ. లేగదూడకి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ముత్తైదువులకు అహ్వనించారు. తల్లి గోవు (బంగారం)గర్భిణీగా  ఉన్న సమయంలో సీమంతం నిర్వహించినట్లు పోషకరాలు మైథిలి తెలిపారు. మూగజీవాల కుటుంబ సభ్యులుగా చూడటం వల్ల వాటిపై అమితమైన ప్రేమను పెంచుకున్నట్లు మైథిలి చెప్పారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:Legadudaki Barsala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page