షుగర్ చూసి డాక్టర్లు నివ్వెరపోయారు

0 30

భోపాల్ ముచ్చట్లు :

 

సాధారణంగా శరీరంలో షుగర్ లెవల్ 100-150 వరకు ఉంటే సాధారణంగా భావిస్తారు. అదే చిన్నపిల్లల్లో ఆహారం తీసుకున్న తర్వాత 200 ఉన్నా ఫర్వాలేదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన 12ఏళ్ల బాలుడికి షుగర్ లెవర్ ఏకంగా 1200 దాటేసింది. దీంతో అతడు కంటిచూపు కోల్పోవడంతో పాటు శరీరంలోని చాలా అవయవాలు పనిచేయడం మానేశాయి. ఇంతకీ అతడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా.. అతిగా చపాతీలు తినడం వల్ల. ఈ విషయం తెలిసి డాక్టర్లు సైతం షాకవుతున్నారు.వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా ఖోడ్ గ్రామంలో సందీప్(12) అనే బాలుడికి కొద్దిరోజులుగా కంటిచూపు తగ్గుతూ వస్తోంది. చివరికి ఓ రోజు సడెన్‌గా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో తండ్రి బన్వారి ఆదివాసి అతడిని సమీపంలోన ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు పరిశీలించారు.

 

 

 

- Advertisement -

సందీప్‌కు షుగర్ లెవల్స్ 1200 కంటే ఎక్కువగా పెరిగిపోయాయని, అందువల్లే ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు. శరీరంలో ఎలాంటి కదలిక లేకపోయినప్పటికీ అతడు శ్వాస తీసుకోవడం, గుండె నెమ్మదిగా కొట్టుకోవడంతో ప్రాణానికి హాని లేదని తెలిపారు.అయితే సందీప్‌కు షుగర్ లెవ్ 1206 ఎందుకు వచ్చిందని అనుమానం వచ్చిన డాక్టర్లు అతడి తండ్రిని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సందీప్ రోజూ 40 చపాతీలు తినేవాడు. దీనివల్ల అతడి తలలో చీము చేరుకుంది. దానివల్లే కంటిచూపు కోల్పోయాడని నిర్ధారించిన డాక్టర్లు అతడి తల నుంచి 720 ఎంఎల్ చీమును వెలికితీశారు. దీంతోపాటు బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించేందుకు 6యూనిట్ల ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. బాలుడు డయాబెటిక్ రెటినోపతి అనే వ్యాధితో బాధపడుతున్నాడని, కళ్లకు వీలైనంత త్వరగా సర్జరీ చేయాలని సూచించారు. దీనికి తల్లిదండ్రులు అంగీకరించడంతో ఐదు రోజుల వ్యవధిలోనే ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశారు. దీంతో సందీప్‌కు కంటిచూపు మళ్లీ తిరిగొచ్చింది.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: The doctors were horrified to see the sugar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page