అప్పుడే ఏమైంది : విజయశాంతి సెటైర్లు

0 12

హైదరాబాద్ ముచ్చట్లు:
కేసీఆర్ సర్కార్ విధానాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విరుచుకుపడే ఫైర్‌బ్రాండ్ మహిళా నేత, బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోమారు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించలేమని కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కి సమాధానం ఇవ్వడంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం వంద మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే సరిపోయే ఎన్నికలే నిర్వహించలేమని చెప్పడం వెనక ఆంతర్యమేంటో చెప్పాలంటూ రాములమ్మ సెటైర్లు వేశారు.విపక్షాలు వద్దంటున్నా మిలియన్ల సంఖ్యలో ఓటర్లు పాల్గొనాల్సిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలను కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వం నిర్వహించిందని విజయశాంతి అన్నారు. ఇప్పుడు కేవలం వంద మంది ఎమ్మెల్యేలు ఓటేసే ఎన్నికలు నిర్వహించలేమని చెప్పడం హుజూరాబాద్ ఉప ఎన్నిక భయంతోనేనని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలే నిర్వహించలేకపోతే లక్షల మంది ఓట్లు వేయాల్సిన ఉప ఎన్నిక కూడా వాయిదా వేయించే ప్రయత్నమని ఆమె అభిప్రాయపడ్డారు.ఉప ఎన్నిక వాయిదా పడి ఇంకా సమయం దొరికితే మరిన్ని మోసపు పథకాలు తీసుకురావొచ్చని.. నాయకులను కొనుగోలు చేయొచ్చంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించి.. ప్రజలను భయభ్రాంతులను చేసి ఎలాగైనా గెలవాలని కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని రాములమ్మ మండిపడ్డారు. ఇప్పటికే జనం దృష్టిలో తేలికైపోయిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరింత నవ్వుల పాలు కాక తప్పదని ఆమె అన్నారు. హుజురాబాద్‌లో ఈటల గెలుపు, టీఆర్‌ఎస్ ఓటమి ఖాయమైపోయిందని ఆమె జోస్యం చెప్పారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:Then what happened: Vijayashanti satires

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page