అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు

0 7

గ్రామ సేవకుల సమస్యలు ప్రభుత్వం గుర్తించాలి..

కౌతాళం   ముచ్చట్లు:
కౌతాళం మండల కేంద్రం నుంచి  మంగళవారం  రాత్రి బయలుదేరిన గ్రామ సేవకుల సమస్యలు పరిష్కరించాలని విజయవాడకు బస్సులో బయలుదేరి మండలం దాటి పాండవగల్లు లో ఉన్నవారిని అక్కడికి వచ్చి కౌతాళం పోలీసులు అరెస్టు చేయడం అక్రమమైన చర్య అని గౌరవ అధ్యక్షులు మల్లయ్య పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వము, పోలీసు వాళ్లు సహకరించారు. కానీ నిన్న మన కౌతాళం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టు చేసినారు. రాష్ట్రంలో కానీ ,జిల్లాలో కాని ఎక్కడ కూడా అరెస్టులు చేయలేదు. విజయవాడలో 2, 3 తేదీలలో ధర్నాలకు వేలాది మంది హాజరై ధర్నాలు జయప్రదం చేసినారు. నాలుగో తేదీ ధర్నాకు మేము వెళుతుంటే మమ్మల్ని అడ్డగించి అరెస్టు చేసి నిర్బంధించి వెళ్లకుండా చేసినారు అని ఆయన అన్నారు. కౌతాళం పోలీసులు ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.
అరెస్టు అనంతరం నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ ముందు గ్రామ సేవకులు అందరము కలిసి ధర్నా నిర్వ హించి నాము. ఈ ధర్నాలో గ్రామ సేవకుల నాయకులు ప్రహల్లాద, నాగరాజు, మారెప్ప, బసన్న, అంపయ్య ,మంగమ్మ, అయ్యమ్మ ,గోపాల్ ,తాయప్ప, ముకప్పా ,మోహన్ ,తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Movements cannot be stopped with arrests

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page