ఆగస్టు 9 సేవ్ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ రెండోరోజు ప్రచారం

0 4

కౌతాళం  ముచ్చట్లు :
దేశవ్యాప్తంగా ఆగస్టు 9న జరుగు సేవ్ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ రెండోరోజు మండలంలో బదినేహాల్ కుంటానహల్l ,ఉప్పర హాల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కె లింగన్న మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ఉపాధి కూలీలను కులాల వారీగా విధించే ఆలోచనలు నిర్మించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆగస్టు 9న దేశ వ్యాప్త కార్యక్రమంలో భాగంగా కౌతాళం లో జరిగే ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల   నాయకులు ఉలిగయ్యా, చాంద్ భాషా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మహబూబ్, వీరయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:The second day of the campaign was to make the August 9 Save India program a success

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page