ఎస్సీ కార్పోరేషన్ రుణాలను వెంటనే మంజూరు చేయాలి  సబ్ ప్లాన్ నిధులను దళితులకే ఖర్చుచేయాలి

0 15

బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఎస్సీ కార్పోరేషన్ ఎదుట ధర్నా
జగిత్యాల ముచ్చట్లు :
రాజ్యాంగ బద్దంగా దళితులకై చెందాల్సిన ఎస్సీ రుణాల మంజూరిలో ప్రభుత్వం వివిక్షను విడనాడాలని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తు బీజేపీ దళిత మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొత్త బాషా పిలుపు మేరకు బుధవారం జగిత్యాల పట్టణంలోని ఎస్పీ కార్పోరేషన్ ఎదుట బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా హక్కులను కలిగిన దళితులు ఎస్పీ కార్పోరేషన్ రుణాలకై దరఖాస్తు చేసుకొంటే రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్ రుణాలను ఇవ్వకుండా దళితులకు అన్యాయం చేస్తోందన్నారు. అలాగే ఎస్పీ సబ్ ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికై ఖర్చు చేయాల్సి ఉండగా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్ళిస్తోందని అవేదన వ్యక్తం చేశారు. ఆనంతరం దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు అలగుర్తి లక్ష్మినారాయణ స్వామి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఎస్పీ కార్పోరేషన్ రుణాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రంలో దరఖాస్తు చేసుకొన్న అర్హులైన ప్రతి దళితుడికి రుణాలను అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే అందోళనలను దశలవారీగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు నక్కజీవన్, రూరల్ మండల అధ్యక్షులు తరాల మహేష్, ధర్మపురి మండల అధ్యక్షులు కడారి గంగాధర్, పెగడపల్లి మండల అధ్యక్షులు రాచర్ల అంజి, వెల్గటూర్ మండల అధ్యక్షులు మల్లేశం, మెట్ పల్లి మండల అధ్యక్షులు అభిలాష్, కోరుట్ల మండల అధ్యక్షులు వెంకటస్వామి, శ్రీనివాస్, రమేష్, గంగాధర్, రాజేష్, తిరుపతితోపాటు పలువురు వున్నారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:SC Corporation loans should be sanctioned immediately
Sub-plan funds should be spent on Dalits

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page