కర్ణాటకలో 24 మంది మంత్రుల ప్రమాణం

0 17

బెంగళూర్ ముచ్చట్లు:
కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్‌ బొమ్మై తన కేబినెట్‌ను బుధవారం విస్తరించారు. గవర్నర్‌ తావార్‌చంద్ గెహ్లాట్ రాజ్ భవన్‌లో 29 మంది కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్, మాజీ మంత్రులు ఈశ్వరప్ప, ఆర్‌ అశోక, బీ శ్రీరాములు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. కొత్త కేబినెట్‌లో 7 మంది ఓబీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఏడుగురు వొక్కలిగలు, 8 మంది లింగాయత్‌లు, రెడ్డి వర్గానికి చెందిన ఒకరితోపాటు ఒక మహిళకు మంత్రి పదవులు దక్కాయి.అయితే ఈసారి డిప్యూటీ సీఎం పదవిని ఎవరికీ కేటాయించలేదు. అలాగే మాజీ సీఎం యెడియూరప్ప కుమారుడు విజయేంద్రను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కీలకమైన మైసూర్, గుల్బర్గా, కొడగు, బళ్లారి, హసన్, రామనగర, దావంగెరె, యాదగిరి, రాయచూర్, విజయపుర, చామరాజనగర్, కోలార్, చిక్‌మగళూర్‌ జిల్లాల నుంచి ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. కాగా, తన కేబినెట్‌ను దశలవారీగా విస్తరిస్తానని సీఎం బసవరాజ్‌ బొమ్మై ఇటీవల తెలిపారు..

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:The standard of 24 ministers in Karnataka

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page