జల వివాదం..మరో బెంచ్ కు బదిలీ

0 9

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడం ఇప్పుడప్పుడే సర్ధుమణిగేలా లేదు. కృష్ణా జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. తెలంగాణకు వ్యతిరేకంగా సీఎం జగన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. గత సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విని.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాలకు సీజేఐ సూచించారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ జరుపడం తనకు ఇష్టం లేదని.. విచారణే కోరుకుంటే పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని పేర్కొన్నారు.సోమవారం నాడు జరిగిన విచారణలో ఈ వివాదానికి మధ్యవర్తిత్వమే మంచిదని రమణ చెప్పిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. న్యాయపరంగానే సమస్యకు పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఏపీ తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే కోర్టుకు తెలిపారు. మరోవైపు.. సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కృష్ణా ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుదుత్పత్తి చేస్తోందని, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జల వివాదాలను సామరస్యంగా తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని సీజేఐ సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చేమో పరిశీలించాలన్నారు. అవసరమైతే ఇందుకు సుప్రీంకోర్టు కూడా సహకరిస్తుందన్నారు. లీగల్‌గా ఈ పిటిషన్‌పై వాదనలు వినలేనని.. తాను రెండు రాష్ట్రాలకూ చెందిన వాడిని అన్నారు. న్యాయపరమైన విచారణే కావాలంటే మరో ధర్మాసనానికి బదిలీ చేస్తాను అన్నారు.మధ్యవర్తిత్వం కుదరదంటే ఈ పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తానని ముందుగా చెప్పినట్లే బుధవారం నాడు రమణ బదిలీ చేశారు. ఈ కేసు ఏ ధర్మాసనం ముందుకు వెళ్తుంది.. ఎప్పుడు విచారణకు వస్తుంది..? విచారణ అనంతరం తీర్పు ఎలా ఉంటుందన్నది చూడాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని సర్వోన్నత న్యాయస్థానంలో ఈ పిటిషన్‌ దాఖలు చేసింది.సీజేఐ వాదనలు విన్నందుకు రెండు రాష్ట్రాలకు అభ్యంతరం లేదని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఇందుకు జస్టిస్‌ ఎన్‌వీ రమణ నిరాకరించారు. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సీజేఐ ఎన్వీ రమణ తోసిపుచ్చారు. అనంతరం ఈ కేసును మరో ధర్మాసనానికి సీజేఐ రమణ బదిలీ చేశారు. కాగా.. కృష్ణా ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుదుత్పత్తి చేస్తోందని, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:Water dispute..transfer to another bench

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page