డిగ్రీ విద్యార్థినిని చంపి రైల్వే ట్రాక్‌పై పడేసిపోయారు

0 24

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైద‌రాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేష‌న్ పరిధిలో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఓ అమ్మాయిని చంపేసి, రైల్వే ట్రాక్‌పై ప‌డేశారు. బోయిన్‌పల్లి ఒమేగా కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చ‌దువుతోన్న విద్యార్థిని (17) మొన్న‌ ఉదయం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయిన‌ప్ప‌టికీ తిరిగి రాక‌పోవ‌డంతో నిన్న ఆమె బంధువులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.రైల్వే ట్రాక్‌పై ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆ విద్యార్థినిని ఉరి వేసి హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేసినట్లు స‌మాచారం. మృతురాలి స్నేహితురాలు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: A degree student was killed and dumped on a railway track

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page