పెద్దారెడ్డి.. తగ్గేదేలా…

0 19

అనంతపురం ముచ్చట్లు :

 

 

ఎమ్మెల్యేగా అయితే గెలవనయితే గెలిచాడు కాని నియోజకవర్గంలో మాత్రం పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు గెలవగా బాగా ఇబ్బంది పడుతుంది తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒక్కరే. సుదీర్ఘకాలం జేసీ సోదరుల కంచుకోటగా ఉన్న తాడిపత్రిని బద్దలు కొట్టి గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి రికార్డు సృష్టించారు. జెయింట్ కిల్లర్ గా పేరు గాంచారు. వైఎస్ జగన్ హవాలో గెలిచిన పెద్దారెడ్డి ఆ తర్వాత మాత్రం తాడిపత్రిలో ఇబ్బందులు తప్పడం లేదు.తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే మళ్లీ ఫ్యాక్షన్ గొడవలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి నియోజకవర్గంలో పట్టుకోసం ప్రయత్నించని రోజు లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డిని బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో జైలుకు పంపగలిగారు. యాభై రోజులు జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి పెద్దారెడ్డి దాడికి వెళ్లారు. ఇరు వర్గాలు నిత్యం మొహరించుకుంటూనే ఉన్నాయి.ఇదిలా ఉండగానే పెద్దరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తాడిపత్రి మున్సిపాలిటీ జేసీ ప్రభాకర్ రెడ్డి పరమయింది. దీనిని పెద్దారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. 16 మంది కౌన్సిలర్లు తమ పార్టీ నుంచి గెలిచినా అధికారాన్ని పెద్దారెడ్డి చేజిక్కించుకోలేకపోయారు. వైసీపీ హైకమాండ్ సూచనల మేరకు ఆయనకే మున్సిపల్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు. తాజాగా జరిగిన రెండో మున్సిపల్ వైెస్ ఛైర్మన్ ఎంపికలో కూడా పెద్దారెడ్డికి చేదు అనుభవమే ఎదురయింది.దీంతో పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అధికారులు ఎవరూ సహకరించకుండా జేసీని కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా జేసీ ప్రభాకర్ రెడ్డిని మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి దించాలన్న లక్ష్యంతోనే పెద్దారెడ్డి ఉన్నట్లు కనపడుతుంది. మరో నలుగురు కౌన్సిలర్లు తమ పార్టీలోకి వస్తే దించేయవచ్చు. అప్పటి దాకా పెద్దారెడ్డికి మనశ్శాంతి అనేది ఉండదంటున్నారు. మొత్తం మీద 151 వైసీీప నియోజకవర్గాల్లో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం రాజకీయంగా రెండేళ్ల నుంచి ఇబ్బంది పడుతుండటం విశేషం.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Peddareddy .. to be reduced …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page