ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రైవేట్ దందా

0 17

అనంతపురం ముచ్చట్లు :

 

 

రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ నియంత్రణకు అలుపెరగని కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే  వేల రూపాయల విలువ చేసే కరోనా పరీక్షలను ప్రజలందరికీ దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయిస్తోంది. అయితే కొంతమంది కేటుగాళ్లు కొత్త దందాకు తేరలేపి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షల నిమిత్తం వచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. తాడిపత్రి పట్టణ పరిధిలోని ఏరియా ఆసుపత్రిలో రోజూ  కరోనా వైరస్‌ పరీక్షల నిమిత్తం ప్రజల వద్ద నుంచి స్వాబ్‌ నమూనాలను అక్కడి వైద్యులు సేకరిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో పెత్తనం చెలాయిస్తున్న కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన వారికి మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు.కరోనా పరీక్షల నిమిత్తం తాడిపత్రి ఏరియా ఆసుపత్రి వచ్చే ప్రజలను ప్రైవేటు వ్యక్తులు కలిసి ‘ఈ రోజు పరీక్షలకు చాలా మంది ఉన్నారు.. ఈ రోజు స్వాబ్‌ నమూనాలను తీసుకోవడం కష్టమే’ అంటూ భయపెడతారు. మాకు తెలిసిన వాళ్లు ఆసుపత్రిలో ఉన్నారు.. రూ.2500 ఇస్తే వెంటనే పరీక్షలు చేయిస్తామంటూ రోగుల వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలాగే మంగళవారం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి కరోనా పరీక్ష నిమిత్తం వచ్చిన ఓ వృద్ధుడికి కరోనా పరీక్ష చేయిస్తామంటూ ఆయన వద్ద నుంచి ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్‌లను తీసుకుని మీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాం.. ఇక మీకు పరీక్ష చేస్తారంటూ ఆయన వద్ద నుంచి రూ.2500 ఓ ప్రైవేటు వ్యక్తి తీసుకున్నారు. అయితే ఆ వృద్ధుడి నుంచి స్వాబ్‌ నమూనాను తీసుకోకపోవడంతో ఆయన సదురు ప్రైవేటు వ్యక్తిని ఫోన్‌లో సంప్రదించగా ఈ రోజు కుదరలేదు.. రేపు రండి కచ్చితంగా చేయిస్తామంటూ సమాధానం వచ్చింది. దీంతో చేసేదేమీ ఏమి లేక కరోనా పరీక్షలకు వచ్చిన వృద్ధుడు వెళ్లిపోయారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Private danda in government hospitals

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page