ప్రమాదానికి గురైన బస్సు మాయం

0 28

నల్గోండ   ముచ్చట్లు :
చిట్యాల మండలం వెలిమినేడు రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సు మాయం అయింది. అసలు ప్రమాదం జరగలేదని కావేరి ట్రావెల్స్ యాజమాన్యం బుకాయించింది. చిలకలూరిపేట నుంచి ముందుగా వచ్చిన బస్సు నకిరేకల్ సమీపంలో బ్రేక్ డౌన్ అయింది. మరో బస్సులో ప్రయాణికులను తరలిస్తుండగా రెండవ బస్సుకు ప్రమాదం జరిగింది. .బస్సు ప్రమాదం ఘటనలో చిట్యాల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆరోపించారు. అసలు  కావేరి ట్రావెల్స్ యాజమాన్యం పై కేసు నమోదు చెయ్యలేదు. .రెండు రోజుల తర్వాత బాధిత కుటుంబ సభ్యులు వచ్చి పిర్యాదు చెయ్యడంతో అలర్ట్ ఆయిన పోలీసులు, ఎట్టకేలకు కేసు నమోదు చేసారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కావేరి ట్రావెల్స్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ చేస్తున్నారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:The accident ate the bus

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page