ప్రేమించడం లేదనే కోపంతో యువతిపై కత్తితో దాడి..ఆపై తానూ పొడుచుకొని…

0 16

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో దారుణం
హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

ప్రేమించడం లేదనే కోపంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆపై అదే కత్తితో తానూ పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఇవాళ మధ్యాహ్నం ఘట తానూ పొడుచుకొని న జరిగింది. బాపూజీనగర్‌కు చెందిన యువతిని యాప్రాల్‌ భరత్‌నగర్‌కు చెందిన గిరీష్‌ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించాడు. ఆమె ప్రేమకు నిరాకరించడంతో ఈ మధ్యాహ్నం ఇంటికి వచ్చి కత్తితో దాడి చేశాడు. యువతి కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానికులు రావడాన్ని గమనించి గిరీష్‌ తానూ అదే కత్తితో పొడుచుకున్నాడు. స్థానికులు ఇద్దరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని దవాఖానకు తరలించారు. గిరీష్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో యువతి గిరీష్‌పై కేసు సైతం పెట్టినట్లు తెలిసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

Tags:Attacking a young woman with a knife in anger for not loving … and then stabbing himself …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page