బీజేపీది దుష్ప్రచారం

0 15

కడప ముచ్చట్లు:
కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించిందcని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి లు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గత నెల 24న అప్పటి కలెక్టర్ హరికిరణ్ ఇచ్చిన ఉత్తర్వులను చూపిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు చేయకూడదని గత కలెక్టర్ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారని అందులో టిప్పుసుల్తాన్ విగ్రహానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎక్కడా లేదన్నారు. టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించలేదన్నారు. ఈ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి కోరామని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ అనుమతి పొంది విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ఆయన అనుమతి రానిపక్షంలో సొంత స్థలంలోనైనా టిప్పు విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:BJP is a bad campaigner

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page