మాస్క్ ధరించమంటే కొట్టారు..

0 16

తిరుపతి ముచ్చట్లు :

 

మాస్కులు ధరించకపోవడంతో రూ.100 జరిమానా విధించిన సచివాలయ ఉద్యోగులపై మద్యం మత్తులో కొందరు దాడికి దిగారు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. స్థానిక అమెరికన్‌ బార్‌ సమీపంలో సచివాలయ సిబ్బంది కరోనా కట్టడి చర్యల్లో భాగంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. కమిషనర్‌ గిరీషా ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. మాస్కులు లేకుండా ముగ్గురు ప్రజల మధ్య తిరుగుతుండడం గుర్తించి మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు. వారు వినిపించుకోలేదు. రూ.100 జరిమానా విధిస్తామని చెప్పడంతో ఆ ముగ్గురూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేశారు. జరిమానా విధించే ప్రభుత్వ మొబైల్‌ను లాక్కొని నేలకేసి కొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. శానిటరీ సెక్రటరీ, ఇన్‌స్పెక్టర్‌ తలకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Wearing a mask is like beating ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page