ముర్రుపాల ఆవశ్యకత పై అవగాహన కల్పించాలి  మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్

0 12

జగిత్యాల ముచ్చట్లు :

ముర్రుపాల ఆవశ్యకత పై అంగన్వాడీ టీచర్లు చంటి పిల్లల తల్లులకు అవగాహన కల్పించాలని జగిత్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ అన్నారు. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాల సందర్భంగా 44 వార్డు ఖాజీ మహేల, గంజ్ రోడ్డు అంగన్ వాడి సెంటర్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో గోలి శ్రీనివాస్ హజరై  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లీబిడ్డకు ఎంతో శ్రేయస్కారమని అన్నారు. తల్లి బిడ్డకు ముర్రుపాలు పట్టించడం ద్వారా వ్యాధి నిరోధకశక్తి పెరిగి శిశువుకు రోగాలు దరి చేరవన్నారు. సరైన అవగాహన లేని కారణంగా ముర్రుపాలు బిడ్డకు తాగించకపోవడంతో త్వరగా వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందన్నారు. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ రాదన్నారు. తల్లిపాలలో ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్ ఏ సమృద్దిగా ఉంటాయన్నారు. పిల్లలకు అస్తమా, మలబద్దకం రాకుండా ఉంటాయని వివరించారు. తల్లిపాలు ముద్దు, డబ్బపాలు వద్దు అనే ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అంగన్ వాడి కేంద్ర నిర్వాహకులపై ఉందన్నారు. పిల్లలకు తల్లులు పాలు ఇవ్వడంపై ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలని అంగన్వాడీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో  అంగన్వాడీ సిబ్బంది జె. తిరుమల, గజాల , తల్లులు, పిల్లలు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Awareness on the need for mumps
Municipal Vice Chairman Goli Srinivas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page