మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ సెన్సేష‌న‌ల్ మూవీ `ఆచార్య‌` రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి.

0 7

సినిమా  ముచ్చట్లు :
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా.. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం `ఆచార్య‌`. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్త‌య్యింది. రెండు పాట‌ల షూటింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు చిత్ర నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.“ఆచార్య‌` సినిమా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణను జూలై 31 నాటికి అనుకున్న ప్లాన్ ప్ర‌కారం పూర్తి చేశాం. రెండు పాట‌ల‌ను మాత్ర‌మే చిత్రీక‌రించాల్సి ఉంది. ఆగ‌స్ట్ 20 నుంచి చిరంజీవి.. చ‌ర‌ణ్ మీద ఓ సాంగ్‌ను, అలాగే చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే మీద మ‌రో సాంగ్‌ను చిత్రీక‌రిస్తాం. దీంతో సినిమా మొత్తం షూటింగ్ పూర్త‌వుతుంది. మ‌రో వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.  చిరంజీవిగారి పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో ప్రేక్ష‌కాభిమానులు మెచ్చేలా తెర‌కెక్కించ‌డంలో దిట్ట అయిన డైరెక్ట‌ర్ కొర‌టాల శివ త‌న‌దైన శైలిలో మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య‌` సినిమాను రూపొందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఆయ‌న అభిమానులు, ప్రేక్ష‌కులు కోరుకుంటారో అన్నీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి.  ఇప్ప‌టికే విడుద‌లైన `లాహే లాహే.. ` సాంగ్‌, టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి సినిమాపై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. ఈ అంచాల‌ను మించేలా సినిమా ఉంటుంది“ అని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలియ‌జేశారు.
న‌టీన‌టులు: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే, సోనూసూద్ త‌దిత‌రులు…

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Megastar Chiranjeevi, Megapower Star Ramcharan, Star Director Koratala Shiva Sensational Movie `Acharya` is shooting except for two songs.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page