రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

0 10

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలలో  రైతువేదికలను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు.   అశ్వారావుపేట నియోజకవర్గం,చంద్రుగొండ మండలం పోకలగూడెం,గానుగపాడు, రవికంపాడు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, రైతు వేదికలను ప్రారంభించి  మొక్కలు నాటారు. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలలో  విస్తుత పర్యటన చేసి , పలు అభివృద్ధి కార్యక్రమలను  రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతుల శ్రేయస్సు కోరుకునే వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్, రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతువేదికలు నిర్మించటం జరిగిందని అన్నారు. రాష్టంలో రైతులను ఆదుకోవడం కోసం రైతుబంధు,రైతుభీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే  మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, దిండిగాల రాజేందర్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags: Collector who started the cashew processing unit

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page