విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు పెరుగుతున్న గిరాకీ

0 16

హైద్రాబాద్  ముచ్చట్లు :

పర్యావరణ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ చార్జింగ్ స్టేషన్లకు గిరాకీ పెరుగుతోంది. 2030లో అధిక సంఖ్యలో వినియోగించే విద్యుత్ వాహనాలే ఉంటాయని చెబుతున్న అధికారులు వాటి సంఖ్యను పెంచడంలో ఎటువంటి శ్రద్ద చూపడం లేదు. విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసి పర్యావరణ పరిరక్షణకు సహకరించండి అని అధికారులు ప్రచారం చేస్తున్నారు. దీంతో  కొనుగోలు దారులు ఆసక్తి చూపిస్తున్నారువిద్యుత్ వాహనాల వినియోగం పెరిగేందుకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఉచితంగానే చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా 6 గంటల నుంచి 7 గంటల పాటు చార్జింగ్ పెట్టుకునే సదుపాయాన్ని ఆయాకేంద్రాలు కల్పిస్తున్నాయి.అయినా విద్యుత్ వాహానాలను వినియోగించేందుకు మాత్రం కొనుగోలు దారులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసినప్పటికి అనంతర పరిణామాల అంశంలో కొనుగోలు దారులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు అందుబాటులో ధరల్లోనే లభిస్తున్నప్పటికి ఛార్జింగ్ కోసం ఆరు నుంచి ఏడు గంటలు సమయం వెచ్చించలేని పరిస్థితుల్లో నగర వాసులు ఉన్నారు. వేగంగా చార్జింగ్ చేసే పరికరాలు ఉన్నప్పటికి బ్యాటరీ సంబంధిత ఇతరత్రా సమస్యలు ఎదురైతే ఏం చేయాలనే సందేహలను వినియోగ దారులు వ్యక్తం చేస్తున్నారు. ఎంత దూరం ప్రయాణం చేయగలం, ఒక వేళ చార్జింగ్ కేంద్రాలు లేని ప్రాంతాలకు వెళ్తే పరిస్థితి ఏంటి ? ఎక్కువ సమయం చార్జింగ్ చేయడం వల్ల వచ్చే సమస్యలు ఎంటి వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న సందేహాలు వ్యక్త అవుతున్నాయి.ఇతర వాహనాలకు ఉన్న సదుపాయాలతో పోలిస్తే పోల్చితే, పెట్రోల్, డిజిల్ వాహానాలే మేలు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో అధికారుల కోసం ప్రస్తుతం 350 అద్దెకార్లును వినియోగిస్తున్నారు. ఒక్కో దానికి సుమారు రూ. 35 వేలు అద్దె చెల్లిస్తున్నారు. సుమారు ఇదే ధరతో ఎలక్ట్రిక్ వాహానాలను అధికారికి కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డ్రైవర్ వేతనం కాకుండా నెలవారీగా అద్దెపై వీటిని ఇచ్చేందుకు ఈసిఐఎల్ కంపెనీ అంగీకరించింది. అద్దెను ఏటా 10 శాతం పెంచేలా ఆరేళ్ళ వ్యవధికి ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పటి వరకు ఇది అమలు కాలేదు. అయితే కొన్ని ఐటీ సంస్థలు మాత్రం తమ ఉద్యోగుల సౌకర్యం కోసం విద్యుత్ వాహనాలు వినియోగిస్తున్నాయి.విద్యుత్ వాహనాల కొనుగోలు చేసిన వారికి కొన్ని రకాల ఇబ్బందులు తప్పడం లేదు. చార్జింగ్ అయిపోయిన ప్రాంతం నుంచి దగ్గరలో చార్జింగ్ కేంద్రం ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నగరంలో ఇప్పటి వరకు 1500 విద్యుత్ వాహనాలు ఉన్నట్లు అంచనా. బంజారాహిల్స్, రాజ్‌భవన్ రోడ్డు, బేగంపేట, పంజాగుట్ట,గచ్చిబౌలీ, జూబ్లీహిల్స్, మియాపూర్ ,బోరబండ, ఓల్డ్ మలక్‌పేట, నాంపల్లి, తదితర ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అయినా వీటి వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఆర్టిసీ జోన్ పరిధిలో 40 ఎలక్ట్రిక్ బస్సులు నగరం నుంచి విమానాశ్రయం వరకు రాకపోకలు సాగిస్తు పర్యావరణహితంగా ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు పెంచేందుకు ప్రభుత్వాలు రాయితీలు ప్రకటిస్తున్నప్పటికి కొనుగోలు దారులు వీటిని పై ఆసక్తి చూపడం లేదు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Increasing demand for electric charging stations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page