సెబీ కేసులో శిల్పాశెట్టికి ఊరట

0 12

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

షేర్‌హోల్డింగ్‌ వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి సెబీ విచారణ ఎదుర్కొంటున్న నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రాలకు ఊరట లభించింది. నిర్దేశిత పరిమితులకు లోబడే షేర్‌హోల్డింగ్‌ ఉన్నందున ఈ విషయంలో వారిపై చర్యలు అవసరం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అభిప్రాయపడింది. 2015 మార్చిలో 25.75 శాతం వాటా కొనుగోలుతో వియాన్‌ ఇండస్ట్రీస్‌ (గతంలో హిందుస్తాన్‌ సేఫ్టీ గ్లాస్‌ ఇండస్ట్రీస్‌)కి శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రా ప్రమోటర్లుగా మారారు. ఆ తర్వాత కంపెనీ కొన్ని షేర్లను ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ కింద కేటాయించింది. ఈ షేర్ల కేటాయింపు విషయాన్ని నిర్దిష్ట సమయంలో నిబంధనలకు అనుగుణంగా వారు వెల్లడించలేదంటూ ఆరోపణలు వచ్చాయి. విచారణ చేపట్టిన సెబీ శిల్పాశెట్టి, రాజ్‌ కుంద్రాల షేర్‌హోల్డింగ్‌ నిర్దిష్ట పరిమితికి లోబడే ఉందని, దీన్ని ప్రత్యేకంగా వెల్లడించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Shilpa Shetty’s seat in Sebi case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page