అభినవ ఇందిరా గాంధీగా లారా దత్తా..

0 8

ముంబై ముచ్చట్లు:

తెరపై నటీనటులను గుర్తుపట్టలేనంతగా మార్చేయగల మ్యాజిక్‌ మేకప్‌కు ఉంది. అందుకు తాజా ఉదాహరణ లారా దత్తా. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘బెల్‌ బాటమ్‌’లో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర చేశారు లారా. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదలైన లారా దత్తా లుక్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి.ఇందిరా గాంధీ గెటప్‌లో ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆమె ఒదిగిపోయారు. తను తనేనా? ఒక మనిషిని మేకప్‌ ఇంతలా మార్చేయగలదా? ఈవిడ ఎవరో గుర్తుపట్టలేరని పందెం కడుతున్నాం అని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఫొటో చూశారుగా.. నిజంగానే లారా.. లారాలా లేరు కదూ. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన హైజాక్‌ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్‌ మూవీకి రంజిత్‌ ఎం.తివారీ దర్శకుడు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Laura Dutta as Abhinava Indira Gandhi ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page