అమ్మ‌పాలు బిడ్డకు అమృతం- 104 డాక్టర్ అనుషా

0 90

రామసముద్రం ముచ్చట్లు:

 

అమ్మపాలు బిడ్డకు అమృతమని 104 వైద్యరాలు అనుషా అన్నారు. గురువారం మండలంలోని కెసిపల్లిలో 104 సేవలను నిర్వహించారు. ఇందులో భాగంగా తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా ఆమె అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా తల్లీ బిడ్డకి మధ్య చక్కని ప్రేమ బంధాన్ని పెంపొందిస్తుందని అన్నారు. తల్లి పాలివ్వడం వల్ల బిడ్డ మానసిక ఆరోగ్యం చక్కగా వృద్ధి చెందుతుందన్నారు. తల్లిపాలకి మించిన పాలు ఏవీ లేవని, చంటి బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంపొందించి, సాధారణ వ్యాధులు నుండి రక్షణ కలిగిస్తాయని అన్నారు. తల్లి పాలు వల్ల బిడ్డకి సంరక్షణ కలగడమే కాకుండా తల్లికి కూడా మంచి ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. బిడ్డకు 6 మాసాలు నిండే వరకు తల్లిపాలే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఏం సుగుణమ్మ, 104 ఆపరేటర్ సెల్వి, ఆశ వర్కర్లు మంజుల, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Amrpalu baby nectar- 104 Dr. Anusha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page