ఆక్రమణలు తొలిగింపు లో రెవెన్యూ అధికారులకు చేదు అనుభవం

0 38

పెట్రోల్ పోసికొని చనిపోతామంటూ బెదిరింపులు
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆది ఆంధ్ర వీధికి చెందిన ఆక్రమణల తొలిగింపు లో రెవెన్యూ అధికారులు కు చేదు అనుభవం ఎదురైంది. ఆక్రమణలు తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటామని అడ్డుపడ్డారు. పోలీసులు,అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కిరోసిన్ పట్టుకొని నిరసన తెలిపారు. మా ఇండ్లు తొలిగిస్తే పెట్రోల్ పోసుకొని చనిపోతామంటూ బెదిరించారు. ఆక్రమణల తొలగింపు పర్వంలో రెవెన్యూ అధికారులకు బాధితులు చుక్కలు చూపించారు.  ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. స్థానిక ఎస్ఐ కామేశ్వరరావు చొరవతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.   ఆక్రమణల తొలగింపులో బెదిరింపులకు  తగ్గేది లేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేసారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:Bitter experience for Revenue officers in evictions

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page