ఎమ్మెల్యే కొడుకుపై  కేసు

0 9

ఖమ్మం ముచ్చట్లు:

 

పాల్వంచ‌కి చెందిన ఫైనాన్స్ వ్యాపారి మల్లిపెద్ది వెంకటేశ్వరరావు ఆత్మహత్య జిల్లాలో కలకలం రేపుతోంది. గత నెల 29న వెంకటేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్ అలజడి రేపింది. తన చావుకి వీళ్లే కారణమంటూ సుమారు 45 మంది పేర్లు రాసి బలవన్మరణానికి పాల్పడడం సంచలనంగా మారింది. అందులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేందర్‌ పేరును ప్రధానంగా రాయడంతో చర్చనీయాంశమైందితమ బంధువుల వద్ద చిట్టీలు వేసి పాడుకుంటే డబ్బులివ్వకుండా ఓ స్థలం అగ్రిమెంట్ చేశారని.. అదే స్థలాన్ని మరొకరికి విక్రయించారని మృతుడి భార్య ఆరోపిస్తోంది. అదేంటని ప్రశ్నించిన తన భర్తని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. ఎమ్మెల్యే కొడుకు రాఘవేందర్ డబ్బులు తీసుకుని వారికి సహకరించారని ఆమె ఆరోపించారు. ఆ స్థలంలో వేసుకున్న రేకుల షెడ్డును కూడా కూల్చివేశారని వాపోయారు. అన్యాయమని ప్రశ్నించినందుకు తన భర్తను కొట్టి.. మానసికంగా హింసించారని.. అవమానభారంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.తన భర్త మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి భార్య శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూసైడ్ నోట్‌ ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను ఏ2గా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు కావడం జిల్లాలో చర్చనీయాంశం మారింది. జిల్లా ఎస్పీ సునీల్ దత్, మణుగూరు ఏఎస్పీ శబరీష్ కేసు విచారణను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: The case against Ms. Son

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page