ఎవ్రీ వీకెండ్ … లాక్ డౌన్

0 16

తిరువనంతపురం ముచ్చట్లు:

 

కేరళ లో కరోనా విజృంభిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల కంటే ఒక కేరళలోనే అధికంగా కేసులు బయటపడుతున్నాయి. కేరళలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు భారీ స్తాయిలో పెరుగుతుండటంతో ప్రభుత్వం కట్టడికి కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతోంది. ఇకపై ప్రతి ఆదివారం రోజున రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడోవేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో కేరళ నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో సరిహద్దు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి అడుగుపెట్టనిస్తామని తమిళనాడు, కర్ణాటక సర్కార్లు నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నప్పటికీ, కేసులు కంట్రోల్ కావడంలేదు. పైగా దేశంలో రోజువారీ కేసుల్లో సగం కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటికే శనివారం,ఆదివారం రెండు రోజులు లాక్ డౌన్ విధించింది కేరళ ప్రభుత్వం. అయితే కొన్ని సడలింపులిచ్చింది. ప్రస్తుతం శనివారం లాక్ డౌన్ ఎత్తివేసి కేవలం ఆదివారం మాత్రం సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పదని హెచ్చరించింది.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; Every weekend … lock down

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page