ఏడేళ్లు దాటినా హామీ పూర్తి కాలేదు

0 5

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ఏడేళ్లు దాటినా తెలంగాణ ప్రభుత్వ  డబుల్ బెడ్ రూమ్ హామీ పూర్తి కాలేదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎద్దేవా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ల కోసం ఇందిరా పార్క్ లో మహాధర్నా చేపట్టారు పెద్ద ఎత్తున సిపిఎం కార్యకర్తలు, పేదలు పాల్గొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల పైచిలుకు డబుల్ బెడ్ రూమ్ అప్లికేషన్లు రాగా కేవలం మూడు లక్షలు మంజూరు చేసి నగరంలోయాబై వేలు మాత్రమే నిర్మించారని మిగతా అన్ని జిల్లాల్లో కలిపి లక్ష వరకు నిర్మించి నమూనాను చూపిస్తున్నారని ఆరోపించారు. రెండు ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన ఆమె అమలు కాలేదని ఎద్దేవా చేశారు. పేదవాళ్లను మీరు ఓటర్లుగా తప్ప మనిషిగా గుర్తించడం లేదా వారి కష్టాలు కనబడడం లేదా మీకు మానవత్వం లేదా మీకు మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి కానీ నిలువ నీడ లేని పేదలకు ఇల్లు నిర్మించరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags; Seven years have passed and the guarantee has not been fulfilled

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page