ఏపీలో సాగరమాల కింద ఎన్ని ప్రాజెక్టులను చేపట్టారు ?.

0 8

– పార్లమెంట్లో అడిగిన నెల్లూరు ఎంపీ ఆదాల

 

నెల్లూరు ముచ్చట్లు:

 

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో సాగరమాల పథకం కింద ఎన్ని ప్రాజెక్టులను చేపట్టారు, వాటి అమలు తీరు ఏమిటని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో గురువారం ప్రశ్నించారు. ఈ పథకం కింద ఎంత మందికి ఉద్యోగాలు లభించాయో తెలపాలని కూడా కోరారు. కేంద్ర ఓడరేవులు, జల  మార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్  రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లో సాగరమాల పథకం కింద సముద్ర జల మార్గాల కు సంబంధించి మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం పలు ప్రాజెక్టులు చేపట్టినట్టు తెలిపారు. భారతీయ రైల్వేలు, జాతీయ రహదారులు , రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేజర్ పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయబడతాయని పేర్కొన్నారు. ఈ పథకం కింద 25,003 కోట్లతో 30 ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే   84,421 కోట్ల రూపాయలతో 91 ప్రాజెక్టుల అభివృద్ధి కార్యక్రమాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.           సాగరమాల పథకం కింద పెద్ద సంఖ్యలో ప్రత్యక్ష,పరోక్షంగా ఉద్యోగాలు కల్పించబడ్డాయని తెలిపారు. ఒక కిలోమీటర్ పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టు నిర్మాణానికి, రైల్వే లైన్ కు సుమారు 24 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఇప్పటివరకు 200 కిలో మీటర్లకు పైగా రైల్వే, పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులు భారతీయ రైల్వే ద్వారా పూర్తయ్యాయని పేర్కొన్నారు.

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags; How many projects have been undertaken under Sagarmala in AP ?.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page