ఐఎస్ ఐ మార్క్ లేకపోతే.. ఫైనే

0 16

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

దేశంలో రోడ్డుప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, హెల్మెట్ ధరించకపోవడం, మితిమీరిన వేగం అందుకు కారణాలుగా చెప్పవచ్చు. కొంతమంది హెల్మెట్ పెట్టుకున్నాం తమకేం కాదు.. తమని ఎవరూ ఆపరని ధీమాగా రోడ్డుమీదకు వస్తుంటారు. అయితే అక్కడే అంతా తప్పులో కాలేసి వేలరూపాయల జరిమానాలకు గురవుతున్నారు.హెల్మెట్ ధ‌రించినా జ‌రిమానా త‌ప్ప‌ని ప‌రిస్థితి రావొచ్చు.. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురాబోతోంది. హెల్మెట్ పెట్టుకున్నా కేంద్రం విధించిన నిబంధనలకు అనుగుణంగా అవిలేకపోతే మీ జేబుకి చిల్లుపడడం ఖాయం. కొత్త నిబంధనలు వాహనదారులపై ప్రతికూల ప్రభావం చూసే అవ‌కాశం ఉంది.. హెల్మెట్‌ రూల్స్‌ను కఠినతరం చేస్తూ పూర్తిగా మార్చేయ‌డ‌మే దీనికి కార‌ణం.హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి చేసిన‌ప్ప‌ట్టి నుంచి రోడ్ల‌పై ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ హెల్మెట్ల విక్ర‌యం కొన‌సాగుతోంది.ప్రభుత్వ నిర్ణయం తమ ప్రాణాలు కాపాడడానికే అనే స్పృహ వాహనదారుల్లో కనిపించడంలేదు. అందుకే క‌నీస క్వాలిటీ కూడా క‌నిపించ‌ని హెల్మెట్లు కొనేసుకుని పోలీసుల ఫైన్ నుంచి త‌ప్పించుకుంటున్నారు.

 

 

 

- Advertisement -

అయితే తాజా నిబంధనల ప్రకారం నాణ్యమయిన హెల్మెట్లు లేకుంటే జరిమానా తప్పదంటున్నారు పోలీసులు. మీరు ఎక్కడ కొనుగోలు చేసినా హెల్మెట్‌పై బీఐఎస్ మార్క్ ఉండాలి. బీఐఎస్ మార్క్ చూసుకోక‌పోతే మాత్రం ఇబ్బంది పడడం ఖాయం.  కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధ‌న‌ల‌కు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మార్క్ కలిగిన హెల్మెట్లను మాత్రమే వాహనదారులు వినియోగించాలి. అయితే. ఈ రూల్స్ మాత్రం వ‌చ్చే ఏడాది మార్చి 1 నుంచి అమలులోకి రానున్నాయి.. హెల్మెట్ కొనేవారికి మాత్ర‌మే కాదు.. ఏదిప‌డితే అది అమ్మి సొమ్ము చేసుకోవాల‌ని చూసేవారికి కూడా ఇది షాక్. కాబట్టి మీరు హెల్మెట్ కొనాలనుకుంటే మాత్రం బీఐఎస్ మార్కున్న నాణ్యత కలిగిన హెల్మెట్ కొనండి. జరిమానాల బారిన పడకుండా జాగ్రత్త పడండి.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: If there is no ISI mark .. Fine

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page