కుందూనది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0 9

-నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

నంద్యాల  ముచ్చట్లు:

- Advertisement -

కుందు నది పరివాహక ప్రాంతాలను. నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు.
గురువారం సాయంకాలం  బండి ఆత్మకూరు మండలం చిన్న బోధన గ్రామం సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది పరివాహక ప్రాంతాన్ని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్. బండి ఆత్మకూరు తహసీల్దార్ హరిత  బండి ఆత్మకూరు మండలం  ఎంపీడీవో  వాసుదేవగుప్తా లతో కలిసి పరిశీలించారు.అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ  పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నందు నీటిని విడుదల చేయడం చేత కుందు నది ఉధృతంగా ప్రవహిస్తున్నది కుందు నది పరివాహక ప్రాంతం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో నదిలోకి ఎవరు వెళ్లరాదని నీటి ప్రవాహం ఇంకా ఉదృతం అయితే సంబంధిత అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు చేర్చవలసి ఉంటుందన్నారు.వీరి వెంట తహసిల్దార్ కార్యాలయం ఆర్ ఐ. సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

 

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

 

Tags: The people of the Kundunadi catchment area should be vigilant

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page