కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

0 14

హైదరాబాద్ ముచ్చట్లు:

 

కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు ( KRMB ) కు తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ రాసింది. సీడ‌బ్ల్యూసీ స‌భ్యుడిపై ఏపీ అభ్యంత‌రం తెలుప‌డంపై ఈఎన్‌సీ నిర‌స‌న వ్య‌క్తం చేసింది. రాయ‌ల‌సీమ ప్రాజెక్టు ప‌రిశీల‌న బృందంలో సీడ‌బ్ల్యూసీ స‌భ్యుడు దేవేంద‌ర్ రావు ఉన్నారు. బృందంలో దేవేంద‌ర్ రావు ఉండ‌టంపై ఏపీ ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. గ‌తంలో సీడ‌బ్ల్యూసీ స‌భ్యుల‌పై తాము అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని తెలంగాణ ఈఎన్‌సీ గుర్తు చేసింది. రాష్ట్ర ప్రాజెక్టుల ప‌రిశీల‌న బృందంలో కే శ్రీనివాస్ ఉన్నారు. గ‌తంలో కే శ్రీనివాస్‌పై తాము అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. సీడ‌బ్ల్యూసీ అధికారికి ప్రాంతాల‌ను ఆపాదించ‌డం అనైతికం అని ఈఎన్‌సీ పేర్కొన్న‌ది. ఎన్జీటీ ఆదేశాల‌ను ఆల‌స్యం చేయ‌డ‌మే ఏపీ ఉద్దేశ‌మ‌ని తెలంగాణ ఈఎన్‌సీ అభిప్రాయ‌ప‌డింది. ఎన్జీటీ ఆదేశాల మేర‌కు రాయ‌ల‌సీమ ప‌నుల‌ను కేఆర్ఎంబీ ప‌రిశీలించాలి. రాయ‌ల‌సీమ ప‌నుల ప‌రిశీల‌న‌పై ఈ నెల 9వ తేదీ లోపు నివేదిక ఇవ్వాల‌ని తెలంగాణ ఈఎన్‌సీ కోరింది.

 

- Advertisement -

9న సమావేశం
ఈ నెల 9న కృష్ణా, గోదావ‌రి న‌దీ యాజ‌మాన్య బోర్డుల ఉమ్మ‌డి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశం హైద‌రాబాద్‌లోని జ‌ల‌సౌధ‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అత్య‌వ‌స‌రంగా స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన రెండు బోర్డులు.. గెజిట్ నోటిఫికేష‌న్‌లోని అంశాల అమ‌లు కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మావేశం గురించి తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలకు కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు ( KRMB ) స‌మాచారం ఇచ్చింది.

 

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags; Telangana government letter to Krishna River Board

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page