గ్రామల్లో సెల్ ఫోన్ సిగ్నల్ సమస్యలు

0 17

ఊరిబయట విద్యార్ధులు
యాదాద్రి భువనగిరి  ముచ్చట్లు:
ఆన్ లైన్ చదువులకు సెల్ ఫోన్ సిగ్నల్స్ శాపంగా మారాయి. సెల్ ఫోన్ సిగ్నల్ సరిగ్గా రాకపోవడంతో సెల్ సిగ్నల్ కోసం ఊరు బయటికి వచ్చి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నిత్యకృత్యం కావడంతో విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమయ్యే సమయానికి ఆ గ్రామంలోని పిల్లలంతా ఊరి బయటికి చేరుకోవడం పరిపాటిగా మారింది. యాదాద్రి జిల్లా భువనగిరి శివారులోని హుస్నాబాద్ లో విద్యార్థుల పరిస్థితి ఇది. హుస్నాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్నప్పటికీ సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా అందకపోవడంతో విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు వినలేక ఇబ్బంది పడుతున్నారు. హుస్నాబాద్ కు చెందిన విద్యార్థులు వ్యవసాయ బావి గడ్డ పై కూర్చొని పాఠాలు వింటున్నారు. ఇంట్లో కూర్చొని చదువుకుందాం అనుకుంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా అందక ఆన్ లైన్ క్లాసులకు అంతరాయం కలుగుతుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆన్లైన్ క్లాసులు వినే అవకాశం లేకుండా పోయింది. దీంతో చదువుపై ఆసక్తి ఉన్న కొందరు విద్యార్థులు సెల్ ఫోన్ సిగ్నల్ వచ్చే ఈ ప్రాంతానికి తరలి వెళ్తున్నారు. ఇందులో భాగంగానే భువనగిరి మండలం హుస్నాబాద్ విద్యార్థులు పొలం వద్ద బావి గడ్డ పైన ఎత్తైన ప్రదేశంలో కూర్చొని పాఠాలు వింటున్నారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:Cell phone signal problems in villages

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page