జగనన్న పచ్చతోరణం మొక్కల పెంపకంలో సర్పంచులదే భాద్యత- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

0 16

– మొక్కలే మానవ మనుగడకు జీవనాధారం
– పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పుదాం

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా రోడ్లుకు ఇరువైపులా మొక్కల పెంపకంలో సర్పంచులు కీలక బాధ్యత వహించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. గురువారం ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు విశ్వనాథం తో కలిసి మండలంలోని చారాల జంగాలపల్లె రోడ్డు,దుర్గసముద్రం పంచాయతీ గాండ్లపల్లె రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి పనులు ప్రారంభించారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో 25 వేల మొక్కలు నాటే కార్యక్రమంకు స్వీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్రానికే ఆదర్శంగా పుంగనూరు నియోజకవర్గంలో రోడ్లుకు ఇరు వైపులా మొక్కలు నాటి వాటిని పెంచడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. మొక్కళే మానవ మనుగడుకు జీవనాధారమని ,పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పుదాంటూ పిలుపునిచ్చారు. మూడు రోజుల్లోపు మొక్కలను నాటే పక్రియను పూర్తిచేయాలని సూచించారు. ప్రభుత్వం వెహోక్కల సంరక్షణకు రెండేళ్ళపాటు ఉపాధి నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఏపీడీ రామాంజనేయులు, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు,మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తి,మాజీ జెడ్పిటీసీ రుక్మిణమ్మ, మంత్రి పిఏ చంద్రహాస్‌, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి, బూత్‌కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి , డైరక్టర్లు రమేష్‌, యోగానంద,సర్పంచులు సరస్వతి,రిజ్వానా,విజయకుమారి,ఓబుల్‌రెడ్డి,రఘునాథరెడ్డి, షంషీర్‌,అనూరాధ, కృష్ణారెడ్డి,సుజాత, నాగరత్న,సావిత్రి ఎంపీటీసీ శ్రీరాములు, ఎంపీడీఓ శంకరయ్య, ఏపిఓ శ్రీనివాసుల యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Jagannath Pachatoranam Sarpanchulade responsibility in the cultivation of plants – YSSRCP Secretary of State Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page