జగిత్యాలలో మళ్లీ లాక్ డౌన్

0 16

కరీంనగర్ ముచ్చట్లు:

 

కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందన్న సంగతి అందిరికీ విదితమే. సెకండ్ వేవ్‌లో జనాల రక్షణ నిమిత్తం తెలంగాణ సర్కారు లాక్‌డౌన్ విధించి ఆ తర్వాత ఎత్తేసింది. దీంతో ప్రజలు ఎప్పటి మాదిరిగానే గుమిగూడటం మనం చూడొచ్చు. కొందరైతే ఏకంగా మాస్కు ధరించకుండా, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం మరిచిపోయారు. ఈ క్రమంలోనే కేసుల విజృంభణ మళ్లీ షురూ అవుతున్నది. థర్డ్ వేవ్ అతి త్వరలో రాబోతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా తెలంగాణలోని ఈ జిల్లాలో ప్రజలు స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకున్నారు. ఇంతకీ అది ఏ జిల్లానంటే..జగిత్యాల జిల్లాలో కొవిడ్ కేసులు ఇటీవల కాలంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో డిస్ట్రిక్ట్‌లోని కొన్ని విలేజెస్ స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకున్నాయి. వెల్గటూర్ మండలం ఎండపల్లి, మద్దుట్లలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరగడంతో ఆ గ్రామ పెద్దలు లాక్ డౌన్ వైపు మొగ్గు చూపారు. గొల్లపల్లి మండలం వెలుగుమట్ల విలేజ్‌లోనూ గ్రామ పంచాయతీ పాలక వర్గం లాక్ డౌన్ విధించింది. సదరు గ్రామంలో కొవిడ్ కేసులతో మరణాలు పెరగకముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు.నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.1,000 ఫైన్ విధించనున్నట్లు గ్రామపంచాయతీ పాలక వర్గం తెలిపింది. మొత్తంగా దేశవ్యాప్తంగాను రోజురోజుకూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ ముప్పు గురించి కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరిస్తున్నది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు సూచిస్తున్నది. అయితే, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాల్లో కేసులు పెరగడాని కంటే ముందుగానే ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు పెళ్లిళ్లకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నది. అతి తక్కువ మంది అతిథుల మధ్యనే శుభకార్యాలు చేసుకోవాలని సూచిస్తున్నది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; Locked down again in Jagits

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page