టోక్యో ఒలింపిక్స్‌ లో భారత క్రీడాకారుల పతకాల పట్ల కేసీఆర్ హర్షం

0 9

హైద‌రాబాద్ ముచ్చట్లు:

 

టోక్యో ఒలింపిక్స్‌ లో భారత దేశ క్రీడాకారులు హాకీ, బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 41 ఏండ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ విజయంతో భారతదేశపు ప్రముఖ క్రీడ హాకీ విశ్వ వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్‌ను, జట్టు క్రీడాకారులను సీఎం ప్రశంసించారు.కాగా  మహిళా బాక్సింగ్ కేటగిరీలో తొలిసారి బరిలోకి దిగి కాంస్యం సాధించిన అస్సాంకు చెందిన భారత బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ని సీఎం అభినందించారు. ఒలింపిక్స్‌లో దేశం తరపున పతకం నెగ్గిన మూడో బాక్సర్‌గా లవ్లీనా చరిత్రకెక్కడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భారత క్రీడాకారులు విశ్వ క్రీడల్లో విజయకేతనం ఎగరేసి మరిన్ని పతకాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

Tags:KCR is excited about the medals of Indian athletes at the Tokyo Olympics

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page