దౌర్జన్యాలకు అడ్డాగా నెల్లూరు-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  

0 7

నెల్లూరు ముచ్చట్లు:

 

ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లా. గడచిన రెండేళ్లుగా దౌర్జన్యాల, దోపిడీలు, దుర్మార్గాలకు కేంద్రబిందువుగా మారిందని, సర్వేపల్లి ఎమ్మెల్యే త అనుచరులతో  ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి సంతకాలు  ఫోర్జరీ చేయించి మరీ, సర్వేపల్లి రిజర్వాయర్ లో మట్టితవ్వకాలకు తెరలేపారని, టీడీపీ  పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తననివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.సోమిరెడ్డి మాట్లాడుతూ అక్రమ మట్టితవ్వకాలకు సంబంధించిన కథనాలు మే30న జర్నలిస్ట్ ఫ్రెండ్స్ గ్రూపుకిచెందిన వాట్సాప్ గ్రూపులో వార్తలొచ్చాయి.  అదేరోజు రాత్రి 7.08 ని.లకు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి  అన్నిఅనుమతులతోనే సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని, కొందరు బ్లాక్ మెయిలర్స్ దానిపై దుష్ర్పచారంచేస్తున్నారని, గ్రూపులో వచ్చిన మెసేజ్ లపై స్పందించారు. సర్వేపల్లి నియోజకవర్గమంతా ఇష్టానుసారం గ్రావెల్, మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. కొన్నిగ్రామాల్లో జరుగుతున్న మైనింగ్ ను గ్రామస్తులే ఎక్కడికక్కడ అడ్డుకుంటూ, అవసరమైనప్రాంతాలలో సీసీ.కెమెరాలుకూడా పెట్టా రు. జీపీఎస్ విధానం అమర్చి, వాహనాలగురించిన సమాచారం తీసుకొని మరీ, గ్రామస్తులే స్వయంగా ఫిర్యాదుచేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో కొన్నివాహనాల ను అడ్డుకున్న అధికారులు వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ లో ఏ2గా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు చేర్చారు. ఐపీసీ 427కింద, మాగుంటపై క్రిమినల్ కేసు పెట్టారు. ఒంగోలు ఎంపీ స్వయంగా మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆయనపేరు చేర్చారు. మాగుంట అగ్రిఫామ్స్ అని ఆయనకు చెందిన సంస్థను కూడా ఫిర్యాదులో చేర్చా రు.

 

 

 

- Advertisement -

సాధారణమైనగ్రావెల్ తవ్వకాలకు ఎంపీ స్థాయి వ్యక్తిఎలా దరఖాస్తు చేసుకుంటాడని అధికారులు ఆలోచించరా? అలాపెట్టుకొనిఉంటే, దానిపై ఎంపీనీ గానీ, ఆయన కార్యాలయాన్ని గానీ సంప్రదించి నిజానిజాలుతెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులపై లేదా? మట్టి తవ్వకాలపేరుతో పెట్టిన దరఖాస్తులు మూడూ ఒకేవిధమైన దస్తూరితోఉంటే, వాటిపై ఫోర్జరీ సంతకాలుపెడితే, దానిపై ఆలోచించరా? ఈవ్యవహారంపై  కాకాణి గోవర్థన్ రెడ్డి అంతా సక్రమంగానే ఉందని, అన్నిఅనుమతులతోనే గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని ఎలా చెబుతారు? సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణికి తెలియకుండా చీమకూడా చిటుక్కుమనదు. తవ్వకాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులే ఒకరిపోర్ట్  కూడా ఇచ్చారు. తాము 8వేలక్యూబిక్ మీటర్లకు అనుమతులిస్తే, 18వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరిగాయన్నారు. అదినిజమో కాదో పరిశీలించడానికి వెళ్లిన టీడీపీవారిపై అక్రమకేసులు పెట్టారు. మాజీ సర్పంచులు, ఇతరమాజీ ప్రజా ప్రతినిధులపై తప్పుడుకేసులుపెట్టారు. ఎంపీ మాగుంటశ్రీనివాసులరెడ్డి సంతకాన్ని గోవర్థన్ రెడ్డి అనుంగుఅనుచరుడే ఫోర్జరీచేశాడు. ఒకే సంతకంతో మూడు దరఖాస్తులు వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులు ఎందుకు పరిశీలించ లేదు? కేసులుపెట్టేటప్పుడు అధికారులు ఎంపీ కార్యాలయాన్ని సంప్రదించరా? వైసీపీఎమ్మెల్యే  తానుసాగిస్తున్న అక్రమమైనింగ్ కోసం ఎంపీని బలిచేస్తారా? ఎంపీ మాగుంటపై ఎమ్మెల్యే కాకాణి కక్షతీర్చుకున్నాడు. కాకాణి దోపిడీపై, అరా చకాలపై  తాము ముఖ్యమంత్రికి అనేకసార్లు ఫిర్యాదుచేసినా, ఆయన ఏనాడూ గోవర్థన్ రెడ్డిని పిలిచివిచారించలేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే కనునసన్నల్లో అధికార పార్టీ ఎంపీ మాగుంటశ్రీనివాసులు రెడ్డిని ఏ2గా ఎఫ్ఐఆర్ లోనమోదుచేయడం సామాన్యవిషయమా? మాగుంట శ్రీనివాసులు రెడ్డి 1000క్యూబిక్ మీటర్లకు సంబంధించిన కేసులో ముద్దాయా? అలా చెప్పడానికి తమకేసిగ్గుగా ఉంది.

 

 

 

 

వైసీపీ ఎమ్మెల్యే ఇష్టానుసారం గ్రావెల్ దోపిడీచేస్తూ, ఏమాత్రం సంబంధంలేని సొంతపార్టీ ఎంపీనే ఇరికించడం దేనికి సంకేతం?  ఎమ్మల్యేలు ఏంచేసినా, అధికారులు చూస్తూఊరుకోవాలని నెల్లూరు పర్యటనకు వచ్చిన సజ్జల చెప్పాడా ? అక్రమ మైనింగ్ ఎంతవరకు, ఏ స్థాయిలో జరిగిందో అధికారులే నిజాలు నిగ్గు తేల్చాలి. ఎంపీసంతకం ఫోర్జరీ చేసిన కాకాణి అనుచరుడిపై క్రిమినల్  కేసులునమోదుచేసి,  అరెస్ట్ చేయాలి. తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ కృష్ణమోహన్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. శాఖాపరమైన విచారణ జరిపి, అతనిపై చర్యలు తీసుకోవాలి. ఎంపీ నిజంగా మైనింగ్ కు దరఖాస్తు చేసుకున్నాడా లేదా అని విచారించకుండా, ఎఫ్ఐఆర్ నమోదుచేసిన ఎస్సై, ఇత ర  పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు మరీ ఇంతదారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటు. కాకాణి గోవర్థన్ రెడ్డి, ఆయనకు సహకరించిన అధికా రులపై ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకొని, మాగుంట కుటుంబం పరువు ప్రతిష్టలు కాపాడాలి.

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

 

Tags: Nellore-Somireddy Chandramohan Reddy is behind the atrocities

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page