నటుడు మురళీమోహన్‌కు హైకోర్టులో ఊరట

0 19

అమరావతి ముచ్చట్లు :

 

టాలీవుడ్ సీనియర్ నటుడు, జయభేరీ ప్రాపర్టీస్ చైర్మన్ మురళీమోహన్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మురళీమోహన్ తన వద్ద స్థలం తీసుకుని మోసం చేశారన్న భూ యజమాని ఫిర్యాదు మేరకు 41-ఎ కింద మురళీమోహన్‌తోపాటు జయభేరీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ నేడు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై జయభేరీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు మురళీమోహన్, కిశోర్ దుగ్గిరాల, ఎం.రామ్మోహన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా మురళీమోహన్ తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. భూ యజమాని ఆరోపిస్తున్నట్టు ఒప్పందంలో ఎలాంటి ఉల్లంఘనలు లేవన్నారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మారుస్తున్నారని ఆరోపించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Actor Murali Mohan in the High Court

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page