పర్యావరణ పరిరక్షణను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి

0 12

– భావితరాల భవిష్యత్తుకు విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి
-జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్

 

కడప ముచ్చట్లు:

 

 

- Advertisement -

పర్యావరణ పరిరక్షణను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని భావితరాల భవిష్యత్తు కోసం విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద నూతన పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి  మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది చేపట్టారని తెలిపారు. ప్రజలు కూడా తమ వంతుగా తమ తమ ఇళ్ల ముందు మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని సూచించారు. కాలుష్య నివారణలో మొక్కలు ఎంతో సహకరిస్తాయని గుర్తు చేశారు.  పర్యావరణ పరిరక్షణకు, మొక్కల సంరక్షణ కు ప్రజలు తమ వంతు తోడ్పాటు అందించాలని ఎస్.పి కోరారు.  ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి (ఆపరేషన్స్) ఎం.దేవ ప్రసాద్, ఏ.ఆర్ డి.ఎస్.పి బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్.పి చెంచుబాబు, ‘దిశ’ ఇంచార్జ్ డి.ఎస్.పి రవి కుమార్, ఆర్.ఐ లు వి.శ్రీనివాసులు, మహబూబ్ బాషా, జార్జి, మహబూబ్ వలి, సోమశేఖర్ నాయక్, వీరేష్, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, ఏ.ఆర్., స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

 

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Environmental protection should be taken as a social responsibility by everyone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page